Home / ANDHRAPRADESH / పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలలో ఎంత మందికి అంటే ?
central government announce medals for police
central government announce medals for police

పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలలో ఎంత మందికి అంటే ?

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను ప్రకటించింది. కాగా స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఇందులో 229 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (PMG) లభించగా.. 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకం (PPM), 642 మందికి పోలీస్‌ విశిష్ట సేవా (పోలీసు మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) పతకాలను కేంద్రం ప్రకటించింది.

పోలీస్‌ మెడల్స్‌ ఫర్‌ గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నవారిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్‌ నుంచి 55 మంది పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్‌ నుంచి 27, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 24 మందికి పీఎంజీ పతకాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం(PPMG) ఒకరిని వరించింది. సీఆర్పీఎఫ్‌ అధికారి లౌక్రక్‌పామ్‌ ఇబోంచా సింగ్‌కు ఈ పురస్కారం అందుకోనున్నారు.

ఏపీ నుంచి 29 మందికి ఈ పతకాలు దక్కాయి. 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. ఇక తెలంగాణ నుంచి 34 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. 22 మందికి పోలీస్‌ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat