ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బీసీ కమిషన్ సభ్యులుగా నియమించబడిన తర్వాత మొట్టమొదటిసారి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉపేంద్ర అన్నారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు జరుగుతున్న అభివృద్ధి కి ఎలాంటి అంతరాయం కలవకుండా ఉండాలని కెసిఆర్ గారి నాయకత్వంలో రాబోయే కాలంలో భారతదేశానికే రోల్ మోడల్ గా ఉండేటట్లు వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.
మరో సభ్యుడు శుభ ప్రద్ పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్ స్థితిలోకి తెచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వారి నాయకత్వం దేశంలోనే బలియమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ ప్రాంతానికి సంబంధించిన అనేకమంది ఉద్యమకారులు బి ఆర్ ఎస్ నాయకులు వీరితో పాటు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది