తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని గర్జన రామారం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన హిల్ స్టోన్ ది రూఫ్ టాప్ రెస్టారెంట్ ని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ రుచికరమైన వంటలను అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందాలని వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు రషీద్ బేగ్ బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు