తెలంగాణలో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఖానాపూర్ పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీర్ రేఖ శ్యామ్ నాయక్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి కండువా కప్పి ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షిస్తులై పార్టీలో ప్రజలు నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం ర్యాలీగా పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్దకెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసారు. యువకులు పెద్ద ఎత్తున జై రేఖ నినాదాలు చేశారు కార్యక్రమంలో ఖానాపూర్ మండల ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.