తెలంగాణలో ఈ నెలలో జరగనున్న గ్రూప్ – 2 పరీక్ష రాయబోయే అభ్యర్థులకు ఊరటనిచ్చింది ప్రభుత్వం. అందులో భాగంగా గ్రూప్-2 పరీక్ష అభ్యర్థుల విన్నపం మేరకు పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.
టీఎస్పీఎస్సీతో చర్చించి అనువైన తారీఖును నిర్ణయించి మళ్లీ గ్రూప్ -2 పరీక్ష ను నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు మరియు సెక్రటరీలతో సమీక్షించి గ్రూప్ 2 పరీక్షల విషయమై అన్ని విషయాలు సమగ్రంగా పరిశీలించి గ్రూప్ 2 పరీక్షలను సీఎం కేసీఆర్ ఆదేశానుసారం నవంబర్ నెలకి వాయిదా వేయడమైనది.