కుత్బుల్లాపూర్ నియోజవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్ లో రూపాయిలు పదిలక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీ ప్రతి బస్తీలలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఇప్పటికే దాదాపుగా 90 శాతం పనులు పూర్తి చేసుకోగలిగామని మిగిలిన పనులను కూడా త్వరతగినిగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మండే రాజు డివిజన్ అధ్యక్షులు పోలీస్ శ్రీకాంత్ సీనియర్ నాయకులు డాక్టర్ హుస్సేన్, వెంకట స్వామి, యూసఫ్, ప్రభాకర్, కావాలి రవి, ఖాసీం, మైనారిటీ అద్యేక్షులు మహమ్మద్ బాలి, యాదగిరి, తార సింగ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.