ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు,కమీషనర్ రామకృష్ణ రావు గారు గౌరవ ప్రజాప్రతినిధులతో బాచుపల్లి 18వ డివిజన్ పరిధిలో 100వ రోజు ప్రగతి యాత్ర లో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి గారితో,స్థానిక డివిజన్ వాసులతో కలిసి పాద యాత్ర నిర్వహించడం జరిగింది.భాగంగా ప్రగతి యాత్ర శతదినోత్సవం సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ మహిళల హారతులు,పెద్దలు,చిన్నారుల స్వాగతం,అదే విధంగా యువకుల గజమాల, బాణసంచతో ఎమ్మెల్యే గారికి,మేయర్ గారికి ఘన స్వాగతం పలికారు.
భాగంగా శ్రీ హోమ్స్ కాలనీ లో 37 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన,35లక్షల వ్యయంతో ఎస్ జేబి హిల్స్ కాలనీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం,59లక్షల వ్యయంతో నందనవనం కాలనీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం,అదే విధంగా 41.80 లక్షల వ్యయంతో రేణుక ఎల్లమ్మ కాలనీ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం,మరియు సాయి అనురాగ్ కాలనీ లో 65 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మరియు సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన వంటి పలు నిర్మాణ అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు,మేయర్ గారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు ,కావాల్సిన మౌళిక సదుపాయాలు,వంటివి,పెండింగ్ లో ఉన్న పనులపై వివరణ,అదే విధంగా నిర్మాణ దశలో ఉన్న పలు అభివృద్ది పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో NMC గౌరవ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు,ఆయా డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,NMC ఆయా విభాగాల అధికారులు, మరియు సిబ్బంది,స్థానిక డివిజన్ ఆయా కాలనీ అసోసియేషన్ సభ్యులు,స్థానిక వాసులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.