తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖమంత్రి వర్యులు కేటీఆర్ మరోసారి తన ఊదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కు చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు వాంకుడోత్ ఉమాదేవి భర్త హరి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో కుటుంబ పోషణ బాధ్యతలు ఉమాదేవిపై పడ్డాయి.
వారి ఇద్దరు కుమార్తెల్లో ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. భర్త మృతితో కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండటం, కుటుంబపోషణ భారంకావడంతో ఆమె తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
ఈ విషయాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన జడ్పీటీసీ కుటుంబాన్ని గురువారం హైదరాబాద్ పిలిపించారు. వారితో మాట్లాడి అండగా ఉంటానని భరోసానివ్వడంతోపాటు పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం రూ.9 లక్షలు ఖాతాకు జమ చేశారు. మంత్రి కేటీఆర్‌కు, ఎమ్మెల్యే హరిప్రియకు ఉమాదేవి కృతజ్ఞతలు తెలిపారు.