తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 300 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ చేసి, అనంతరం ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. ఇదే క్రమంలో సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ నిఅందించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ:ఈ రోజు సంగారెడ్డిలో పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది.ముఖ్యమంత్రి గారు తండాలను గ్రామపంచాయతీలుగా చేశారు. చిన్న గ్రామపంచాయతీలో కూడా సర్పంచ్ తో పాటు పంచాయతీ సెక్రెటరీ నియమించి పదివేల మంది పంచాయతి సెక్రటరీలకు ఉపాధి కల్పించాం.తెలంగాణ 3 శాతం ఉన్న జనాభా కు 38% అవార్డులు దేశంలో వస్తున్నాయంటే దాని వెనుక మీ కృషి ఉంది.ఈరోజు అన్ని గ్రామాలకు ట్రాక్టరు, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీ ఉన్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వల్లే సాధ్యమైంది.దేశంలో ఏ రాష్ట్రంలో ఏ గ్రామానికి ఇన్ని వసతులు లేవు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టి అంటు రోగాలు నిర్మూలించగలిగాం.సంగారెడ్డిలో 300 మొదటి దశ బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల సహాయం అందించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
మంత్రి హారీష్ ఇంకా మాట్లాడుతూ ఇది దశలవారీగా కొనసాగుతుంది బీసీ బంధు నిరంతర ప్రక్రియ.బీసీ వర్గాలనే కాదు అన్ని కులాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఈరోజు ముఖ్యంగా బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ చేసే అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 19 బీసీ గురుకుల పాఠశాలలుంటే ఈరోజు 310 గురుకుల పాఠశాలలు బీసీల కోసం ఏర్పాటు చేసుకున్నాం. వాటిని జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ కూడా చేసుకున్నాం.మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని ఆడపిల్లల విద్య కోసం శ్రీకారం చుట్టాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.అదేవిధంగా పై చదువులు చదువుకోడానికి బయట దేశాలకు పోవాలనుకున్న వారి కోసం జ్యోతిబాయ్ పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద 20 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు.
కులవృత్తులు ఆత్మగౌరవంతో బతకాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులకు, రజక సోదరులకు ఉచిత కరెంటు ఇస్తున్నారు. 100 కోట్లతో 35 వేల సెలూన్లకు 60 వేల లాండ్రీ షాపులకు ఉచిత కరెంటు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు.అదేవిధంగా గీత కార్మికుల కోసం పాత బకాయిల రద్దు చేసి చెట్టు పన్ను రద్దుచేసిన నాయకుడు కెసిఆర్ గారు. 6లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా అందిస్తున్నారు.నేతన్నను కూడా ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మగ్గమున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామన్నారు అదేవిధంగా పింఛన్ ఇస్తున్నారు.సద్ది తిన్నరేవు కలవాలి అంటారు అందుకనే ఇన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రజలను కాపాడుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మళ్లీ గెలిపీయాలి.కాంగ్రెస్ వాళ్లకు మాట్లాడడానికి మాటల్లేవు. నిలబెట్టడానికి నాయకులు లేరు.కాంగ్రెస్ అధికారంలోకొస్తే మూడు గంటలు కరెంటు చాలు అంటున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దొంగరాత్రి కరెంటు ఇచ్చిర్రు ఇప్పుడు అది కూడా ఇయ్యరంట 3 గంటలే ఇస్తారంట.మూడు గంటల కరెంటు చాలు అంటే ఏ రైతన్నయినా కాంగ్రెస్‌ను మరి చూస్తాడా.కరెంటు కోతలతో రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ. రైతులను పోలీస్ స్టేషన్లో లైన్లో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలపైన ఆలోచన లేదు కాంగ్రెస్‌కి.ఈరోజు 70 వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది.5300 కోట్ల రూపాయలు రైతు బీమా కింద రైతు కుటుంబానికి సహాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి గారికి.
పక్కన ఉన్న కర్ణాటకలో 24 గంటలు కరెంటు ఉందా. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ 24 గంటలు కరెంటు ఇస్తున్నారా. ఈ దేశంలో 24 గంటల కరెంటు రైతుల ఇస్తుంది అంటే అది కేవలం ఒకే ఒక నాయకుడు మన కేసీఆర్ గారు.రైతు రుణమాఫీ రద్దు చేయరేమో అనుకొని దింపుడు గల ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు రైతు రుణమాఫీ చేసి బుద్ధి చెప్పారు కెసిఆర్ గారు.సోమవారం రోజు పెద్ద ఎత్తున రైతుల అకౌంట్లో డబ్బులు వేసి సోమవారం సాయంత్రం వరకు 99 వేల రూపాయల వరకు రైతులు రుణ మాఫీ చేస్తాము.కెసిఆర్ రైతులకు అడిగింది ఇచ్చిండు అడగంది ఇచ్చిండు. రైతుబంధు రైతు బీమా ఇచ్చిండు రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేసిండు. కాలేశ్వరం కట్టి పుష్కలంగా నీళ్లు తెచ్చిండు 24 గంటల కరెంటు ఇచ్చిండు కేసీఆర్ అని అన్నారు.