ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ రచించిన ‘‘షీ.. ద లీడర్’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చాగోష్ఠిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు.
మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో రాజకీయ పార్టీలు సమాజానికి ప్రతిబింబమని ఆమె అన్నారు. మహిళలకు నిర్దిష్టమైన ప్రాతినిధ్యం ఉండాలన్న తప్పనిసరి నిబంధన లేనంత వరకు పార్టీల్లో అదే పరిస్థితి కొనసాగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.