ఎన్టీఆర్ మనవడై ఉండి.. నారా లోకేష్ తెలుగును ఖూనీ చేస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో కమెడియన్స్, సర్కస్‌లో బఫూన్లు ఉన్నట్లే రాజకీయాల్లోనూ బఫూన్లు ఉంటారని నారా లోకేశ్‌ని ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు జాతి గర్వపడాలని ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే లోకేశ్.. ఆ తెలుగును ఖూనీ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.
పొట్టకోస్తే అక్షరం ముక్కలేదు.. తెలుగు మాట్లాడటం అసలు రాదు. అలాంటి వ్యక్తి నన్ను విమర్శిస్తున్నాడు. దిగజారి విమర్శలు చేస్తున్నాడని అంబటి రాంబాబు అన్నారు. పోలవరంలో 72 శాతం పూర్తి చేశానని చంద్రబాబు అంటున్నాడు.. నేను 48 శాతం మాత్రమే చేశారు అంటున్నా.. ఈ అంశంలో చర్చకు చంద్రబాబు రావాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, సింబల్ ను లాక్కోవడానికి మీ నాన్న ఎన్నెన్ని పనులు చేశాడో చెప్పాలా అని మంత్రి విమర్శించారు.
తండ్రికి చెడ్డపేరు తెస్తున్నాడని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నాడు. సీఎం జగన్ తండ్రి పేరును మరింత ముందుకు తీసుకెళ్తున్న కుమారుడు. ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రుల కుమారులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. కానీ జగన్ గారిలా పట్టుదలతో రాజకీయాలు చేసి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి అయిన వారెరవరైనా ఉన్నారా..?’ అని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ ముగ్గురు కలిసి వచ్చినా, ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా సీఎం జగన్‌ని ఓడించడం వారికి సాధ్యం కాదు అని వెల్లడించారు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుట్టడం కాదు…లోకేశ్ లాంటి తెలుగును ఖూనీ చేసే లాంటి వారు పుడతారని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.