తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు చేసిన పనికి ఫిదా అయ్యారు సిద్దిపేట బాలికల విద్యాలయానికి చెందిన చిన్నారులు.
నిన్న బుధవారం సిద్దిపేటలో ఉన్న బాలికల విద్యాలయ సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హారీష్ రావు విద్యార్థులతో ఆత్మీయంగా పలకరించారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు స్కూల్ ఎలా ఉంది.. సిద్దిపేటలో అభివృద్ధి ఏది నచ్చింది. రన్నింగ్ లో ఫ్రైజ్ తెచ్చుకుంటారా..? భవిష్యత్తులో ఏమి చేస్తారు? అంటూ చిన్నారులను ప్రశ్నించారు.
ఆస్మా అనే విద్యార్థిని మాట్లాడుతూ మా స్కూల్ ని బాగా చేశారు సర్ . బహుత్ అచ్చాహై.. బాగా చదువుకోని మంచి పేరు తెస్తాం . సిద్దిపేటలో అన్ని బాగున్నాయి. మీరు అభివృద్ధి బ్రాండ్ అంబాసిడర్ .. మీ పనితనానికి ఫ్యాన్స్ సారు అని అన్నారు.