వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అస్పత్రిని 100పడకల ఏరియా అస్పత్రిగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి, మంత్రి హరీష్ రావు గారి దృష్టకి తీసుకువెళ్లడమే కాకుండ అసెంబ్లీ సమావేశాలలో సైతం బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రస్థావించారు.
దీనిపై వెంటనే స్పందించిన మంత్రి హరీష్ రావు గారు వర్దన్నపేటలోని 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అస్పత్రి ని 100పడకల ఏరియా అస్పత్రిగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దింతో అస్పత్రి అభివృద్ధికి 26కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. దీనికి సంబందించిన జీవో కాపీని మంత్రి హరీష్ రావు గారు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి అందజేశారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటు వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవనం ఏర్పాటు చేయడంతో పాటు హాసన్ పర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50పడకల అస్పత్రిగా మార్చాలని మంత్రి గారిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి గారు త్వరలోనే దానికి అవసరమైన నిధులు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.