తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ నగరవాసులకు ప్రజారవాణాను మరింత చేరువచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కాలుష్యరహిత మెట్రో విస్తరణకు పూనుకున్నది.
ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో లైన్ నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న మార్గాలను పొడిగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బేగంపేటలోని హైదరబాద్ రైల్ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జీహెచ్‌సీఎం పరిధిలోని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెట్రో విస్తరణపై అధికారులతో చర్చించారు.