ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా అంగళ్ళులో ఇటీవల జరిగిన ఘటనలో ముదివీడు ఠాణాలో కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ కేసులో ఏ వన్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏ టూ గా దేవినేని ఉమ … ఏ త్రీ గా అమర్ నాథ్ రెడ్డి.. ఏ ఫోర్ గా రాంగోపాల్ రెడ్డిని పేర్కొంటూ పోలీసులు కేసును నమోదు చేశారు.
హత్యాయత్నం ,నేరపూరిత కుట్ర కిందఈ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ములకల చెరువు స్టేషన్ లో చంద్రబాబుపై రోడ్ షో లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ అధికార వైసీపీకి చెందిన నేతలు కార్యకర్తలు కేసులు నమోదు చేయించారు.