ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ,సమస్యల పరిష్కారమే లక్ష్యం గా సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. మంత్రి అంటే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండరు అనేది సహజంగా సమాజం లో ఉన్న అభిప్రాయం.. ఆ అభిప్రాయాన్ని తుడిపి వేస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలు లు వింటూ.. వాటిని పరిష్కరిస్తూ జన సంక్షేమమే తన సంకల్పం అని చాటి చెబుతున్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
ఉదయం 10 గంటలు… అపద లో ఉన్నవారు అన్నా అంటే నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పే తమ అభిమాన నాయకుడు సూర్యాపేట క్యాంపు కార్యాలయం లో అందుబాటులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న నియోజకవర్గ ప్రజానీకం ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు, కుటుంభ సమస్యలను విన్నవించుకోవడానికి వంద ల సంఖ్య లో క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.. తనను కలువడానికి ఇంత మంది ప్రజలు వచ్చిన విషయం తెలుసుకున్న మంత్రి, అన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుని వెంటనే క్రిందికి దిగారు.. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను ఒకరి తరువాత ఒకరిని నేరుగా కలిసిన మంత్రి ప్రజా సమస్యలను వెంటనే తీరుస్తూ, కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం వెతుకుతూ, ఐదు గంటల పాటు ఓపిగ్గా ప్రజలతో మమేకమయ్యారు. కుటుంభ పెద్ద మాదిరిగా బార్య, భర్తల వివాదాలను సైతం పరిష్కరించిన జగ్గన్న ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కు గా నిలిచారు.
మంత్రి తమతో మమేకం అయిన తీరును చూసిన ప్రజానీకం మంత్రి మంచి మనసుకు ఫిదా అయ్యారు. మంత్రి అంటే చుట్టూ సెక్యూరిటీ, అనుచర గణం మధ్య తమను కలుస్తారో లేదో అని అనుమానం గా వచ్చిన తమ తో మంత్రి జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన తీరు , మా సమస్యలను దూరం చేయడం ఆయన చూపిన చొరవ ఆయనకు మరింత దగ్గరయ్యేలా చేసిందని కొనియాడారు.. జగదీష్ అన్న సూర్యాపేట లో ఉన్నంత కాలం మేమంతా ఆయన వైపే అంటూ ఆనందం తో వెనుదిరిగారు.