తెలంగాణలోని గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాలలో కుడికాలువ కు ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి సాగు నీరు విడుదల చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పాలమూరు జిల్లా కరువు జిల్లాగానే కష్టాలను, కన్నీటిని దిగమింగుకుని ఇక్కడి జనం బతుకు జీవుడా అంటూ వలసలు వెళ్లేలా చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పాలమూరు బిడ్డల తెగువ చూసిన సీఎం కేసీఆర్ మొదటి నుంచే ఈ జిల్లాపై ఎనలేని ప్రేమను చూపించారని అన్నారు. ఒకప్పటి వలసల జిల్లా పాలమూరు ఇప్పుడు అన్నపూర్ణగా మారిందన్నారు. కరోనాతో అల్లాడుతున్న కేరళ ప్రజల ఆకలిని….అవసరాలను తీర్చేందుకు ముందుకొచ్చిందన్నారు. . జూరాల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశామని, రైతులకు రైతుబంధు, వ్యవసాయానికి 24గంటలు ఇవ్వడంతో పాటు.. సాగు నీటి అవసరాల కోసం రిజార్వయర్‌లను పూర్తి చేసి వ్యవసాయానికి పెద్ద పీట వేసిందన్నారు. సాగునీటిని అవసరాల కోసం కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు వ్యవసాయం అంటే దండగ అన్నారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు వ్యవసాయం అంటే అండగా నిరూపించిన నాయకుడు.గద్వాల జిల్లా రైతాంగం 30 ఎకరాల నుండి 50 ఎవరాల వరకు సాగునీరు రైతులకు పుష్కలంగా అందించడం జరుగుతుంది. డిసెంబర్ వరకు రైతులు పంటను పండించుకోవడానికి నీటిని విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు నీటిని వృధా చేయకుండా క్రమ పద్ధతిలో వాడుకోవాలని తెలిపారు.నడిగడ్డలో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. జూరాలకు వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకుని నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా ర్యాలంపాడు, గూడెందొడ్డి పంపు మోటార్లు ఇప్పటికే ఆన్ చేశామని, రిజర్వాయర్ల ద్వార కాలువలకు సాగు నీరు వదలడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పద్మా వెంకటేశ్వర రెడ్డి, రాజశేఖర్, ఎంపీపి విజయ్, వైస్ ఎంపీపి సుదర్శన్ రెడ్డి, ధరూర్ మండల పార్టీ అధ్యక్షుడు డి.ఆర్ విజయ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఈశ్వరయ్య, సర్పంచులు శివారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, ఉపసర్పంచ్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు, భగీరథ వంశీ,ఈశ్వర్, హనుమంత్ రెడ్డి, ముని రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు