కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ గోల్మాల్… రైతుబంధుకు రాంరాం… దళితబంధుకు జైభీం… ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించి… అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు, అనేక రంగాల్లో తెలంగాణ నమూనాగా నిల్చి నంబర్ వన్ గా నిలబెడుతున్నందుకు కాంగ్రెస్ నేతలు నాకు పిండం పెడతారంట… ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో నిర్ణయించుకోవాలి.
చెయ్యగలిగిందే చెప్పాలి. చెప్పింది ధైర్యంగా చెయ్యాలె… ఇక బీజేపీ కూడా తక్కువేమీకాదు… ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడ తీర్మానం చేసి అధికారంలోకి వచ్చాక 3 రాష్ట్రాలు ఇచ్చి… కాకినాడ తీర్మానాన్ని కాకి ఎత్తుకెళ్లినట్లుగా మోసం చేశారు…
మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం.. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయి… మా అమ్ముల పొదిలో చాలా అస్త్రాలు ఉన్నాయి… ఆ అస్త్రాలు తీసినప్పుడు విపక్షాలు గాలిలో కొట్టుకుపోతాయి…. నెల రోజుల్లో రైతులకు రుణమాఫీని ఖచ్చితంగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు.