తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిమ్స్ వైద్యుల కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
నాలుగైదు రోజుల్లో కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేస్తామన్నారు. శాసన మండలిలో వైద్యారోగ్యశాఖపై సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు.
కళ్ల కలకతో వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు. కళ్ల కలక నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటళ్ల సిబ్బందికి సూచనలు అందించామని తెలిపారు. ప్రజలంతా వ్యక్తిగ శుభ్రత పాటించాలని సూచించారు.