తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగో రోజు మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఆదివారం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది.
2021-22 ఏడాది ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలో వైద్యారోగ్యం పంచాయతీ రాజ్ శాఖలకు ముప్పై నాలుగు శాతం అధికంగా ఖర్చు పెట్టినట్లు..గృహ నిర్మాణం పరిశ్రమల శాఖలకు కేటాయింపులకంటే తక్కువగా ఖర్చు చేసినట్లు తెలిపింది.
వంద రోజుల పాటు రూ ఇరవై రెండు వేల ఆరు వందల ఆరవై తొమ్మిది కోట్ల ఓవర్ డ్రాప్ట్ కు ప్రభుత్వం వెళ్లింది. రాబడుల్లో యాబై శాతం వేతనాలు వడ్డీల చెల్లింపులకే వెళ్తున్నాయంది. అయితే కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లు నలబై నాలుగు శాతం తగ్గాయని కాగ్ తెలిపింది.