కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముస్లిం మైనార్టీ సోదరులకు గ్రేవ్ యార్డ్ కొరకు సర్వేనెంబర్ 186 బాచుపల్లిలో గల రెండు ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినందుకు గాను ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క సామాజిక వర్గ సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మైనార్టీ సంక్షేమానికి ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అందిస్తుంది అని వాటిని సద్వినియోగపరుచుకోవాలని మైనారిటీ సోదరులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.