ఈరోజు గురువారం నుండి మొదలవుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాలకు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల తనను అనర్హుడ్ని ప్రకటించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కల్సి తనను ఎమ్మెల్యేగా గుర్తించాలి..
అందుకు సంబంధించిన హైకోర్టు ఉత్తర్వుల కాపీని ఆయనకు అందజేశారు. అయితే ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై రేపు శుక్రవారం విచారణ చేయనున్నది సుప్రీం కోర్టు.