19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు ఆగస్టు నేటి నుంచి పున: ప్రారంభించి, సెప్టెంబర్ రెండో వారం కల్లా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలు పట్ల హర్షిస్తూ సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ గారి బొమ్మ వద్ద సత్తుపల్లి రూరల్, టౌన్ మండల రైతులు, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రైతు రుణమాఫీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫ్లెక్సీ కి పూలాభిషేకం, పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.
ప్రజాసంక్షేమం, రైతు సంక్షేమం కొరకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు సంక్షేమానికి మరో అడుగు ముందుకు వేస్తూ రైతు రుణమాఫీ పట్ల ఆదేశాలు జారీ చేయడం హర్షించదగ్గ విషయమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలోనే ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనకు దీటుగా ఏ ప్రభుత్వం చేయడం లేదన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వారి అడుగుజాడల్లో సత్తుపల్లిని అభివృద్ధి పథంలో నడుపుతున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారికి రానున్న ఎన్నికల్లో మరో మారు పట్టం కట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్ చల్లగుల్ల కృష్ణయ్య, ఎంపిపి దొడ్డ హైమవతి శంకరరావు, అత్మ ఛైర్మెన్ వనమా వాసు, మండల నాయకులు శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, అమరవరపు విజయనిర్మల, కంచర్ల నాగయ్య, నాగార్జున వెంకట చారి, నాగేశ్వరావు, మోరంపూడి ప్రభాకర్ గాయం రాంబాబు కోఆప్షన్ సభ్యులు అయుబ్ పాషా, కోడిమల్ల అప్పారావు, నాగు, మిద్దె శీను తదితులున్నారు.