ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రైతు సంక్షేమ పాలనలో రైతులకు పెద్దపీట వేస్తూ రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతన్నల కొరకు రుణమాఫీకి నిర్ణయం తీసుకొని రైతు జీవితాలలో సంతోషాలు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, బిఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. రేపు ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామాలలో మరియు అన్ని మండల కేంద్రాలలో రైతు సోదరులతో కలిసి సంబరాలు నిర్వహించాలి..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రైతులతో ఆనందం పంచుకోవాలి. ఈ కార్యక్రమంలో రైతులతో కలిసి రైతు నాయకులు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా తెలియజేయడమైనది.
