తెలంగాణలో ఈ సీజన్‌లో వరి సాగు రికార్డులను తిరగరాయనున్నది. ప్రస్తుత సాగు తీరు చూస్తుంటే గత ఏడాదిని అధిగమించనున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25.52 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి.
నిరుడు ఈ సమయం వరకు 14.75 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైం ది. అంటే ఇప్పటికే 11 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగు కావడం గమనార్హం. గత వానకాలంలో రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్‌లో ఇది అధిగమించే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇక పత్తి కూడా ఈసారి భారీగానే సాగవుతున్నది. గతేడాది ఈ సమయానికి 45 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తు తం ఇది 43.38 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక మొ త్తం పంటలు కూడా నిరుటికి మించి సాగవుతున్నది.
గతేడాది ఇదే సమయానికి 74 లక్షల ఎకరాల్లో సాగు కాగా ప్రస్తుతం ఇది 83 లక్షల ఎకరాలకు చేరింది. అంటే నిరుడుతో పోల్చితే మొత్తం సాగు కూడా 9 లక్ష ల ఎకరాలు పెరగడం గమనార్హం. మిగిలిన పంటలు కూడా ఇదే స్థాయిలో సాగవుతున్నాయి. మక్కజొన్న 4.51 లక్షల ఎకరాల్లో, కంది 4.18 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 4.26 లక్షల ఎకరాల్లో సాగైంది.