తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో జులై 28 నుండి 30వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్నోలో జరిగిన 6వ నేషనల్ కాడెట్ క్యోరుగి అండ్ టైక్వాండో ఛాంపియన్షిప్ లో తెలంగాణకు చెందిన నాగ సాయి ఆరుషి అండర్ 164cm విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించి ఖెలో ఇండియా కు ఎంపికైన సందర్భంగా అభినందించారు.
ఈ సందర్బం గా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ మాట్లాడుతూ… క్రీడల అభివృద్ధికి చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వేదికలపై తమ ప్రతిభ పాటలను ప్రదర్శిస్తున్నారన్నారు. దేశానికి సరిపడే క్రీడాకారులను తెలంగాణ రాష్ట్రం నుండి అందించాలని లక్ష్యంతో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు అలాగే క్రీడారంగంలో తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి క్రీడలలో పేరు ప్రతిష్టలు తేవాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీఈటి అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్, కుమారి నాగ సాయి ఆరుషి తల్లిదండ్రులు పవన్ కుమార్, ఈశ్వరి, కోచ్ మధుసూదన్, అంబటి పరమేష్, తదితరులు పాల్గొన్నారు.