Home / SLIDER / జ్ఞాపకంలోనూ మరవని స్పూర్తిని అభినందించిన జోగినిపల్లి సంతోష్ కుమార్

జ్ఞాపకంలోనూ మరవని స్పూర్తిని అభినందించిన జోగినిపల్లి సంతోష్ కుమార్

“ప్రతీ మనిషి జీవితంలో బంధం, అనుంబంధం, వాటి తాలూకూ జ్ఞాపకాలు మనుషుల్ని నడిపిస్తుంటాయి. అయితే అందరూ తమకు ఇష్టమైన వ్యక్తుల జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకుంటే.. కొందరు మాత్రం వాటికి ఆకృతినిచ్చి ఆరాధిస్తుంటారన్నారు” జోగినిపల్లి సంతోష్ కుమార్.

ఆరు సంవత్సరాల క్రితం తన నుంచి దూరమైన తన భర్త జ్ఞాపకాలను, తన భర్త పుట్టిన రోజునాడు నాటిన చెట్టులో చూసుకుంటూ.. ప్రతీ సంవత్సరం తన భర్త పుట్టిన రోజునాడు ఆ మొక్కకు బర్త్ డే వేడుకలు జరుపుతున్న వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కోట్రికా విజయలక్ష్మి గురించి తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇవ్వాల ఫోన్ చేసి మాట్లాడారు.

“జీవితం ఉన్నంత వరకూ ఇష్టపడ్డ వ్యక్తుల జ్ఞాపకాలు ఉంటాయని, అవి వారు గుర్తొచ్చిన ప్రతీ క్షణం మన హృదయాన్ని కదిలిస్తుంటాయని.. అయితే, జ్ఞాపకాలను ప్రకృతితో మమేకం చేయాలనే ఆలోచన అద్భుతమైనదని” జ్ఞాపకం.. గుర్తుగా మిగిలిపోకుండా సమాజం బాగుకోసం ఆలోచించడం చాలా అరుదైన విషయమని విజయలక్ష్మిని అభినందించారు. *బాధను కూడా పదిమంది బాగుగా మార్చిన మీ మానవత్వం సమాజానికి ఆదర్శమని ప్రశంసించారు. మీరు చేసే ప్రకృతి సేవకు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సదా అండగా ఉంటుందని జోగినిపల్లి సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat