సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రజానాయకుడు, అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అని అన్నారు.కల్లూరు పట్టణంలోని బిఅర్ఎస్ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బిఅర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, మండల ఎస్సీ సెల్ కార్యదర్శి బొక్కా వెంకటేశ్వర్లు, AMC డైరెక్టర్ కట్టా అర్లప్ప లు మాట్లాడుతూ…..
గత కొన్ని రోజులుగా స్థానిక శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారిపై సోషల్ మీడియా వేదికగా తల్లాడ మండలానికి చెందిన S యూట్యూబ్ చానల్ రిపోర్టర్ ఇస్నేపల్లి శ్రీనివాస్, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొరకొప్పు రామారావు లు వరుస కథనాలతో, తప్పుడు ప్రకటనలు వాట్స్ ఆప్ లో గ్రూపుల్లో పోస్టులు పెడుతూ ఎమ్మేల్యే సండ్ర గారి ప్రతిష్ట కు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్న సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేదా ఎమ్మెల్యే గారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరగటం లేదనీ అంటున్న మీరు, ఏ మండలంలో ఏ గ్రామంలో, ఏ దళిత కాలనీల్లో అభివృద్ధి జరగడం లేదో చర్చకు సిద్దంగా ఉండాలనీ, లేదా జరిగే అభివృద్ధి మేం చూపిస్తాం మాతో రావాలని సవాల్ విసిరారు.
యు ట్యూబ్ చానల్ పేరుతో, NGO పేరుతో, ప్రైవేట్ సంఘాల పేరుతో మీరు చేసే అక్రమ దందాలు, మీరు ఎంత గడించారో అందరకూ తెలుసని, మీ కాకమ్మ కబుర్లకు, పిట్టకథలకు ఇక్కడ ఎవ్వరు బయపడేవారులేరని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకూ రూ,, 1000 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, కల్లూరు లోనే 3.5 కోట్ల తో మినీ స్టేడియం, 11 కోట్ల తో 50 పడకల ప్రభుత్వ వైద్య విధాన పరిషత్, 2.5 కోట్ల తో జలవనరుల శాఖ ఎస్. ఈ కార్యాలయం, 20 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నూతన బస్టాండ్ కు కేటాయించడం, దానిలో సుమారు 50 లక్షలతో
నిర్మాణం, రాజ్య సభ సభ్యులు బండి పార్థ సారది రెడ్డి గారి 1 కోటి విరాళంతో చేపట్టబోయే నిర్మాణం., నియోజవర్గంలోని 85 కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం, లైబ్రరీలు, ప్రతి దళిత వాడల్లో పక్కా సీసి రోడ్లు, సహా అన్ని మండలాలు, గ్రామాల్లో కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి కి ఎమ్మేల్యే సండ్ర విశేష కృషి చేస్తున్నరనీ అన్నారు. ఇవేవీ మీ కళ్ళకు కనబడవు అని, ఎక్కడైనా చిన్న తప్పిదం ఉంటే అది భూతద్దం లో చూపించి మీ నైజం బయటపెడతానని విమర్శించారు. అసలు నియోజకవర్గంలో మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని, మీ సహాయం కోరిన వ్యక్తి గానీ, కుటుంబం గానీ, గ్రామం గానీ ఎవరో చెప్పాలనీ అన్నారు. కేవలం దళిత సామాజిక వర్గం, దళిత వాదం ను అడ్డు పెట్టుకొని ఎమ్మేల్యే గారి పై బురద జల్లే ప్రయత్నం చేస్తే నియోజకవర్గంలో ఉన్న అదే దళిత సామాజిక వర్గమే తగిన బుద్ది చెబుతారని తీవ్రంగా హెచ్చరించారు. ఇకనైనా మీ బుద్ది మార్చుకుంటే మీకే మంచిదని హితవు పలికారు.
కల్లూరు డివిజన్ ఎమ్మేల్యే సండ్ర హయం లోనే జరిగిందని, సత్తుపల్లి నీ జిల్లా చేస్తే ఎవరు వద్దాన్నారని, కల్లూరు లో మహిళా డిగ్రీ కాలేజీ పెడితే ఎవరు వద్దాన్నారనీ ప్రజలను రెచ్చగొట్టి, మీ పబ్బం గడుపుకోవాలనీ చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఎమ్మేల్యే సండ్ర ఎవరి మీద అక్రమ కేసులు పెట్టించలేదని, నిజంగా అలా ఉంటే మీ లాంటి వాళ్ళు తయారు అయ్యేవాళ్ళే కాదని అన్నారు. నియోజకవర్గ పరిధిలో జరిగే అభివృద్ధి నీ చూసి ఓర్చుకోలేక నియోజకవర్గ ఎల్లలు తెలియని వాళ్ళు మీతో ఆడించే డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు విగ్నులని మీ ఆటలు సాగనివ్వరని, మీ చిల్లర గారడీలకు మోసపొరని, రెచ్చ గోడితే రెచ్చిపొరని అన్నారు. అభివృద్ధి నీ కాంక్షించే సత్తుపల్లి ప్రజలు, మేధావి వర్గం బిఅర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మేల్యే సండ్ర గారికి తిరిగి పట్టం కట్టడం ఖాయం అని, మీరు తల్లకిందులుగా తప్పస్సు చేసినా, అభివృద్ధి ప్రదాత, నిజాయితీకి నిలువుటద్దం అయిన సండ్ర గెలుపును ఇక్కడేవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో….. బి అర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, ఎస్సీ సెల్ మండల కార్యదర్శి బొక్కా వెంకటేశ్వర్లు, AMC డైరెక్టర్ కట్టా ఆర్లప్ప, వార్డు సభ్యులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి పుల్లారావు , చాట్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.