Home / SLIDER / దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం

దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం

ఇది ఆరంభం.! నిరంతర ప్రక్రియ. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం. స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల బీసీ బంధు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు.కుల వృత్తులు బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి వృత్తిపైన ఆధారపడిన వారందరికీప్రోత్సాహకంగా లక్ష గ్రాంట్ అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.జిల్లా కేంద్రమైన సిద్ధిపేట వయోలా గార్డెన్ లో ఆదివారం ఉదయం బీసీ వెల్పేర్ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహం కోసం లక్ష రూపాయల గ్రాంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హాజరై రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల వృత్తులను బలోపేతం చేయాలని, సీఎం కేసీఆర్ ఆలోచన చేశారని చెప్పారు.గత ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీ పేరిట బీసీలకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ బ్యాంకు 40 శాతం, బ్యాంకు 40 శాతం ఉంటే ప్రభుత్వం 60 శాతం పెడుతూ బ్యాంకు కాంసెంట్ తదితర కొర్రీలతో ఎన్నో లింకులు ఉండేవనీ, ఆ రుణం కోసం షూరిటీ కావాలనితిరిగి తిరిగి చెప్పులరిగేవనీ, కానీ మన సీఎం కేసీఆర్ ఇవేమీ షూరిటీ, డాక్యుమెంట్స్ లేకుండా నేరుగా గ్రాంట్ రూపంలో లక్ష రూపాయలు మీకు అందించేలా ఆలోచన చేశారని మంత్రి తెలిపారు.

అన్నీ వర్గాల ప్రజలను అన్నీ విధాలుగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.కులవృత్తి పై ఆధారపడి జీవిస్తున్న విశ్వబ్రాహ్మణులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వరకే రజకులు, నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గీతా కార్మికులకు లైసెన్స్ ఆటో రెన్యువల్ సిస్టం తీసుకొచ్చామని, అలాగే వైన్స్లలో రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. మన సిద్ధిపేట మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు చేపలు ఎగుమతి చేసేంతగా మత్స్య సంపద పెరిగిందని చాలా సంతోషంగా ఉన్నదని, లారీల కొద్దీ చాపలు, రొయ్యలు ఆంధ్రా విజయవాడ, పశ్చిమ బెంగాల్ కలకత్తా, మహారాష్ట్ర చందలాపూర్, హైదరాబాద్ తదితర ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 300 బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ వచ్చాయని, వారం రోజుల్లో సిద్ధిపేటకు డిగ్రీ బీసీ రెసిడెన్షియల్ తేబోతున్నట్లు మంత్రి ప్రకటించారు.యాదవ, కుర్మ కులస్తులకు గొర్రెల యూనిట్లు అందించి తెలంగాణ ప్రభుత్వం వారి కులవృత్తిని ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. దసరా, బతుకమ్మ పండుగ చేనేత చీరలు అందరికీ అందించి చేనేత వృత్తికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. అన్నీ కులాలను అన్నీ రకాలుగా అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అన్నీ కులాలలో అర్హులైన వారందరికీ దశల వారీగా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, పారదర్శకంగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేశామని, ప్రభుత్వం అందించే లక్ష రూపాయల గ్రాంట్ స్వయం ఉపాధి కోసం వినియోగించి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. కులవృత్తి పై ఆధారపడిన అన్నీ కులాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మీ దీవెనలు, ఆశీర్వాదాలు కావాలని మంత్రి కోరారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. బీసీ లక్ష రుణం కోసం 12 వేల అప్లికేషన్స్ వచ్చాయని, మంత్రి ఆదేశాల మేరకు ప్రాధాన్యత ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరిగిందని తెలిపారు. డబ్బులు ఉట్టిగా రావంటూ ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని
మీ కులవృత్తులను కాపాడుకోవాలని, మీ వ్యాపారం పెంచుకోవాలని లబ్ధిదారులను కలెక్టర్ కోరారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat