పరకాల మండలం మల్లక్కపెట,పైడిపల్లి గ్రామాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలను పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు.
చెరువు కట్టల మరమ్మత్తులకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్దo చేసివ్వాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.వరదల్లో కూడా బురద రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అతి భారీ వర్షం (ఒక్క రోజులో 60 సెం.మీ) పడితే ఒకవైపు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడుతుంటే కనిపిస్త లేదా అని ప్రశ్నించారు.ఈ చిల్లర రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమికొడతారు.ప్రజలకు మంచిచేయకపోయిన పర్వాలేదు చేసే వారిని విమర్శించడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.