తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత .. పఠాన్ చెర్ నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది.
ఎమ్మెల్యే మహిపాల్ కు చెందిన పెద్దకుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్య కారణంగా కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యానికి గురైన విష్ణువర్ధన్ రెడ్డి మూడు రోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..
ఈ నేపథ్యంలో ఈరోజు గురువారం తెల్లవారుజామున రెండు గంటలన్నరకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. విష్ణువర్ధన్ మరణ వార్త తెల్సిన బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.