జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీపీ రెండో దశను కూడా చేపడుతామని ప్రకటించారు.శివారు మున్సిపాలిటీల్లోనూ అమలు గురించి ట్విట్టర్లో వెల్లడించిన మంత్రి కేటీఆర్.
జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీపీ రెండో దశను కూడా చేపడుతామని ప్రకటించారు. నగర శివారు ప్రాంత మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. దీని ద్వారా వరదలు ప్రభావం చాలా తగ్గుతుందని బుధవారం మంత్రి ట్విట్టర్ ద్వారా వివరించారు.