సికింద్రాబాద్ నూతన ఆర్ డీ ఓ గా నియమితులైన టీ.రవి మంగళవారం డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.
మర్యాదపూర్వకంగా తనను కలిసిన ఆర్ డీ ఓ రవిని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అభినందించి, రెవిన్యూ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అభిలషించారు.
అదే విధంగా నూతన ట్రాఫిక్ ఏ సీ పీ గా బాధ్యతలు చేపట్టిన ఎన్ బీ రత్నం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అభినందించారు.