తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఇటీవల సత్తుపల్లి లో జరిగిన కాంగ్రెస్ సభలో.. మాజీ ఎంపి, కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ….ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య గారిని ఉద్దేశించి కేసీఆర్ కి మించిన దొర ఎమ్మేల్యే సండ్ర అని వ్యంగంగా మాట్లాడటం, అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని, ఇంటికి పంపడం ఖాయం అని అహంకార పూరితంగా మాట్లాడటాన్ని బిఅర్ఎస్ కల్లూరు మండల ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపి శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మేల్యే సండ్ర గారిని కించపరిచే విధంగా “దొర ” అంటూ వ్యక్తి గత దూషణలకు దిగడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఎమ్మేల్యే గారి దొర స్వబావాన్ని మీరు నిరూపించగలరా…!! పోనీ ఎవరి మీద చుపారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎస్సీ , ఎస్టీ నాయకులపై మీరు చూపించే కపట ప్రేమ, దొరతనం , వివక్ష కు చాలా సాక్ష్యాలు ఉన్నాయి., మీ దొరతనానికి సాక్ష్యాలు…. వైరా లో మాజీ ఎమ్మేల్యే మధన్ లాల్ గారు, ప్రస్తుత ఎమ్మేల్యే రాములు నాయక్ గారు మీ దొరతనానికి తట్టుకోలేకే బయటకు వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు.,
అలాగే గతంలో మధిరలో మరో దళిత నాయకుడు లింగాల కమల్ రాజు గారు మీ దొర తనం తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక బయటకు వచ్చింది నిజం కాదా..,! సత్తుపల్లి నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా మీతో ఉన్న మరో దళిత నాయకుడు డా,, మట్టా దయానంద్ గారిని దూరం పెడుతుంటే, మీ దొర తనం ముందు తట్టుకోలేక, మిమ్మల్ని వదిలి బయటకు వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు…! నిన్న సత్తుపల్లి లో జరిగిన కాంగ్రెస్ సభకు అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన ఎస్టీ గిరిజన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గారిని ను పిలవకుండా అవమానిస్తే మీరు గ్రూప్ రాజకీయాలు ప్రోత్స హిస్తున్నారంటూ… గిరిజనులను అవమానిస్తున్నారని తానే స్వయంగా భహిరంగగా విమర్శించింది నిజం కాదా అని ప్రశ్నించారు…! ఇవన్నీ మీ దొర తనానికి, ధన అహంకారానికి నిదర్శనాలు కావా…!!! మళ్ళీ ఇప్పుడు క్రొత్తగా వచ్చిన మరో దళిత నాయకుడు కొండూరు సుధాకర్ గారు., పాపం వీళ్ళ జాబితాలో వారిని చేర్చకపోతే అదృష్టవంతుడే అని ఎద్దేవా చేశారు. దళిత గిరిజన నాయకులంటే మీకు అంత చులకనా.., మీ కాలు కింద చెప్పులా మీ చెప్పు చేతల్లో ఉండాలి.., లేకపోతే గేట్ ఔట్ అంటారు.., మళ్ళీ మరో కొత్త నాయకుణ్ణి తెస్తారు. ఎందుకంటే మన వద్ద లారీల కొద్ది డబ్బు ఉంది, ఏదైనా అనొచ్చు, ఏదైనా చేయవచ్చు.., ఇదేగా మన దైర్యం…, దీన్ని బట్టి ఎవరు సార్ దొర..,! ఎవరిది సార్ దొరతనం…!!!
మీరు ఎంపి గా ఉన్న హాయాం నుంచి ఇప్పటి వరకూ మీ సొంత ఊరు నారాయణపురం గ్రామానికి గానీ, సొంత మండలానికి గానీ, జిల్లాకు గానీ, అక్కడ ఉన్న ప్రజలకు గానీ ఉపయోగపడే పని ఒక్కటి , అభివృద్ధి పని ఒక్కటైన ఏమి చేశారో చెప్పాలనీ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం లో డా,, బి.అర్ అంబేద్కర్ గారు కల్పించిన ఎస్సీ రిజర్వేషన్ స్థానం లో ఒక దళిత ఎమ్మేల్యే ఉంటే ఎందుకు మీకు అంత అక్కస్సు , సండ్ర నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ…ప్రజా సమస్యలపై పోరాడుతూ…నియోజకవర్గ అభివృద్దికి తన శక్తికి మించి అహర్నిశలు కృషి చేస్తుంటే ఎమ్మేల్యే సండ్ర గారు చేసిన తప్పేంటి సార్..!!!, ఎందుకు అంత ఈర్శ్యా , ఎమ్మేల్యే గారు చేసే అభివృద్ధి పనులు ప్రతి గ్రామంలో ప్రత్యేక్ష సాక్ష్యలుగా ఉన్నాయని, గత 15 ఏళ్ళల్లో జరిగిన అభివృద్ధి లో సండ్ర.గారి మార్క్ నియోజకవర్గ పై కనబడుతుందని, మరి మీరు చేసిన అభివృద్ధి, మీ మార్క్ మీ గ్రామంలో గానీ, మండలంలో గానీ, నియోజకవర్గంలో గానీ , జిల్లా లో గానీ ఎక్కడైనా కనిపిస్తుందా అని సూటిగా ప్రశ్నించారు.
నిన్నటి వరకు బిఅర్ఎస్ తో అంట కాగిన మీరు, బయటకు వెళ్లి ఒక్కసారిగా ఇన్ని విమర్శలు చేస్తున్నారే దాంట్లో ఉన్నపుడు ఇవి ఎవి గుర్తురాలేదా…, మొన్ననే బీ జె పి నోట్లో తలపెట్టి బిజెపి చేరికల కమిటీ నేతలకు మీ ఇంటి వద్దే భారీ విందులు ఏర్పాటు చేసి, లాభ నష్టాలు బెరీజువేసుకొని తూకంలో బరువు కాంగ్రెస్ వైపు ఉందని గ్రహించి ఇటు వచ్చారు తప్ప, నిజంగా కాంగ్రెస్ పై ప్రేమో.., అభీమానమో కాదనీ ఘుటుగా విమర్శించారు. మీరు అవకాశవాదంతో ఉన్నారనడానికి కొన్ని రోజుల క్రితం సాక్షాత్తూ రాహుల్ గాంధీ గారు తెలంగాణ లో జొడో యాత్ర చేపడితే, బిజెపి నా కాంగ్రెస్ నా అని సందిగ్ధం లో ఉన్న మీరు రాహుల్ గాంధీ గారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు. అంటే అవకాశ వాదానికి ఇంతకంటే నిదర్శనం ఎంకావాలి..!, ఈ విషియాలన్నీ విజ్ఞులైన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు అందరూ గమనిస్తున్నారు.
కేవలం ధన బలంతో రాజకీయాలను శాసించాలనే మీ ధన సిద్దాంతం దొరతనానికి నిలువుటద్దం లా పడుతుందని, మీరా దొర అని విమర్శ చేసేది. నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడు, ప్రజా సేవకుడు అయిన ఎమ్మేల్యే సండ్ర ను విజ్ఞులైన నియోజకవర్గ ప్రజలే మళ్ళీ గెలిపించి తీరుతారని అన్నారు. సండ్ర గారికి ప్రజా బలంతో పాటు దైవ సంకల్పం తోడై కొండంత అండగా ఉన్నంత కాలం ఎన్ని కుయుక్తులు పన్నినా ఎవ్వరు ఏమీ చేయలేరని అన్నారు., పొంగులేటి గారు మీ దృష్టిలో ఎస్సీ , ఎస్టీలు ఎవరు మీలా వ్యాపారాలు చేసి అభివృద్ది చెందకూడదా.., అలా ఎవరైనా ఉంటే పెద్ద తప్పు చేసినట్టా..! ఒక వ్యక్తి వ్యాపారం చేయడం నేరమా..,. మరి మీరు.చేసేది ఏమిటి.., ఎస్సీ,.ఎస్టీలు ఎప్పుడు మీ చెప్పు చేతల్లో ఉండాలా..! లేకపోతే అంతేనా.., అదేనా మీ రాజకీయ సిద్దాంతం…, రోజులు మారాయి సార్, మనం కూడా మారాలి.., ప్రజల్ని ఎవరు ఎంతో కాలం మబ్బే పెట్టలేరు. కపట ప్రేమ, కపట ఆప్యాయతలు, అవకాశవాద విధానం పనిగట్టుకొని ప్రదర్శించినా ఎంతో కాలం నిలబడవు, నిజం నిప్పు లాంటిది నిజాయతీగా ఉన్న సండ్ర గారు కూడా నిప్పే , ఎవరికి భయపడే ప్రశ్నే లేదు…!!!
కార్యక్రమంలో…. బి అర్ ఎస్ ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు ఉబ్బన వెంకటరత్నం, కొరకోప్పు ప్రసాద్, మేకల కృష్ణ, అజ్మీరా జమలయ్య, నందిగాం ప్రసాద్, బొక్కా వెంకటేశ్వర్లు సింగిశాల ప్రసాద్, ఖమ్మంపాటి పల్లారావు, బానొత్ బాలు, గొల్లమందల ప్రసాద్, కొర్ర నరసింహారావు, కువ్వారపు విజయారావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి రమేష్, మోదుగు వీరయ్య, బోల్లేపోగు రవి, రామకృష్ణ, చాట్ల సునీల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.