తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు అనర్హత వేటు వేసింది..
ఈ క్రమంలో తన సమీప ప్రత్యర్థి.. బీఆర్ఎస్ నేత.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరారావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది..అంతే కాకుండా హైకోర్టు ఐదు లక్షల జరిమానా విధిస్తూ 2018 ఎన్నికల్లో సమీప అభ్యర్థిగా ఉన్న జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది.