తెలంగాణలో రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఏనుమముల పరుధిలోని ఎస్ఆర్ నగర్లోని లోతట్టు ప్రాంతాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ , మేయర్ గుండు సుధారాణి , కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి గారు అధికారులను ఆదేశించారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అప్రమతంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.