Home / SLIDER / బిసిల సర్వతోముఖాభివ్రుద్దికి కేసీఆర్ సర్కార్ కృషి
Admissions In Karimnagar Medical College From August ANNONCED BY Minister Gangula

బిసిల సర్వతోముఖాభివ్రుద్దికి కేసీఆర్ సర్కార్ కృషి

తెలంగాణలో వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. మెరికల్లాంటి బిసి విధ్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాలు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ వర్సీటీలు సహా 200కు పైగా ఇన్ట్సిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి సంపూర్ణంగా ఫీజులను (ఆర్టీఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. ఈ మేరకు నేడు సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు.

గతంలో మన రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని ఈ విద్యా సంవత్సరం నుంచి బిసిలకు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రిగారి ఆదేశం మేరకు అమలు చేస్తున్నామన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10వేల మంది బిసి విధ్యార్థులకు లబ్దీ చేకూరుతుందని, ఇందుకోసం అదనంగా ఏటా 150కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బిసి విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్పులతో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రియంబర్మెంట్ చెల్లిస్తున్నామని, ఇకనుండి దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లోని బిసి బిడ్డలకు సైతం పూర్తి ఫీజు అందించడంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బిసి విద్యార్థులకు పూర్తి ఫీజుల్ని చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అన్నారు మంత్రి గంగుల కమలాకర్.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే ఆసరా ఫించన్లు, రైతుబందు, ఉచితకరెంటు తదితర పథకాల్లో మెజార్టీ వాటాతో పాటు ప్రత్యేకంగా వేలకోట్లతో ఆత్మగౌరవ భవనాలు, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు లక్ష రూపాయల సహాయం, లక్షలాది బిసి బిడ్డలకు నాణ్యమైన ప్రపంచస్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని. నేడు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బిసి బిడ్డలకు ఎస్సీ, ఎస్టీల మాదిరి పీజు అందించడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat