మణిపూర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించి దేశ వ్యాప్తంగా అలజడి రేపిన మహిళల నగ్నంగా ఊరెగింపు వీడియోపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై చాలా రోజుల క్రితమే కేసు నమోదయింది. వీడియో కూడా దొరికింది. కానీ పార్లమెంట్ సమావేశాల ముందు రోజే వీడియోను లీక్ చేశారు.
ఇందులో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది. మణిపూర్లో బీజేపీ సర్కారు ఉండటం వల్లే కాంగ్రెస్ నిందిస్తోంది. బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి’ అని మండిపడ్డారు.