మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన జరిగిన అదే రోజు మరో ఇద్దరు యువతులపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.
కాంగ్ పీక్సీ ప్రాంతంలో కార్ సర్వీస్ కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరు యువతులపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోలీసులు ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించినట్లు.. అక్కడ యువతులు చనిపోయినట్లు, వారి స్నేహితురాలు మీడియాకు వెల్లడించింది.