ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మూసాపేట్ సర్కిల్ లోని ఫతేనగర్ డివిజన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్, భరత్ నగర్ నాలా పరిసర ప్రాంతాలు రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రెండు రోజుల పాటు భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు.
కాగా ఫతేనగర్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో జన జీవనం స్తంభించిందని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన ఫతేనగర్ డివిజన్ పరిధిలోని దీన్ దయాల్ నగర్, భరత్ నగర్ ముంపు ప్రాంతాల్లో కార్పొరేటర్ తో కలిసి పర్యటించారు.
వర్షాలతో ఇబ్బందులపై జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాఫిక్ పోలీసు అధికారులతో చర్చించి, చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలకు మరియు ఆస్తులకు భద్రత కల్పించడానికి విస్తృతమైన వరద రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.