తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రి, అదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, చిలుకూరి రామచంద్రా రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.
ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజాదరణ పొందిన నేతగా వారు అందించిన స్పూర్తి గొప్పదని సిఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాజీ మంత్రి సి. రామచంద్రారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సి.ఎస్ శాంతికుమారిని సిఎం ఆదేశించారు.