తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి ఆయా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పువ్వాడ అజయ్ కుమార్ గారికి ఫోన్ చేసి పరిస్థితిని వాకోబు చేశారు.వరద ప్రవాహ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, అర్థ రాత్రిళ్లు సైతం పరిస్థితిని సమీక్షించాలని సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు.
ఉన్న రక్షణ, సహాయక సౌకర్యాలు వినియోగించి ఎక్కడ కూడా ప్రాణ, నష్టం అస్థి నష్టం జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న మంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎం కేసీఆర్ గారికి మంత్రి పువ్వాడ వివరించారు.
దుమ్ముగూడెం వద్ద వరద ప్రవాహం తీవ్ర స్ధాయిలో ఉన్నప్పటికీ, ఏక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదని, జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఉందని, ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారందరికీ ఆహారం, త్రాగునీరు, ఇతర వసతులు కల్పించామని వివరించారు..