రైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు అన్నారు.రైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు అన్నారు.
కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు 24 గంటలు కరెంటు కావాలో, మూడు గంటల కరెంటు కావాలో తేల్చుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని ఏనాడూ ఆలోచించలేదని ఆరోపించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఅర్ రైతులను ఆదుకోవడానికి వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నారని చెప్పారు.
రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.అనంతరం మండలంలోని పలువురికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కడెం మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధికారులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.