తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ టీ కార్యనిర్వాహక అధ్యక్షులు , పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ” Gift A Smile ” కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు IVF- అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఉచిత అంబులెన్స్ ను గతంలో ఇచ్చిన సంగతి తెల్సిందే.
కరోనా సమయంలో ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఒక ఉచిత అంబులెన్స్ ను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్ ను ఇవ్వడం జరిగినది. అయితే ఈరోజు మంగళవారం అటు వైపు వెళ్లిన సందర్భంగా హాస్పిటల్ లో ఉన్న అంబులెన్స్ ను పరిశీలించి, అంబులెన్స్ రన్నింగ్ కండిషన్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.