తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి సోయి లేకుండా మాట్లాడారు. నిన్న సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..’రాజీవ్‌గాంధీ సతీమణి ఇందిరాగాంధీ’ అంటూ వ్యాఖ్యానించి ఆ తరువాత నాలుక కరుచుకున్నారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి సోయి లేకుండా మాట్లాడారు.
నిన్న సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్‌గాంధీ సతీమణి ఇందిరాగాంధీ’ అంటూ వ్యాఖ్యానించి ఆ తరువాత నాలుక కరుచుకున్నారు.
రాజీవ్‌గాంధీ మాతృమూర్తి ఇందిరాగాంధీని సతీమణి అని వ్యాఖ్యానించడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అంతా తలలు పట్టుకున్నారు. ఆ తరువాత రాజీవ్‌గాంధీ సతీమణి సోనియాగాంధీ అంటూ తప్పును దిద్దుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. రేవంత్‌రెడ్డి ఇలాగే సోయి లేకుండా మాట్లాడుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వాపోతున్నారు.