చిలకలగుడా లోని కట్ట మైసమ్మ దేవాలయం లో రంగం వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్.. . వర్షాలు బాగా కురుస్తాయా, రైతులు సుఖంగా ఉంటారా అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అడిగిన ప్రశ్నలకు రంగం భవిష్య వాణి లో పాల్గొన్న ప్రజావతి సానుకూలంగా స్పందించి వానలు మంచిగ కురుస్తాయని, రైతులు ఆనందంగా ఉంటారని చెప్పారు.
అదే విధంగా ఆలయం విస్తరిస్తామని అశీ ర్వదించాలని డిప్యూటీ స్పీకర్ కోరగా సానుకూలత వ్యక్తం చేశారు. అదే విధంగా పద్మారావు గౌడ్ మూడో సారి విజయం సాధించడం తధ్యమని, ఆయనే ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు భవిస్య వాణి సమాధానం చెప్పారు.
ఈ ఏడాదే ఆలయం పునర్నిర్మాణం ప్రారంభిస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్పొరేటర్ సామల హేమ, ఆలయం ఈ ఓ మహేందర్, అధికారులు నేతలు పాల్గొన్నారు. బోనాలు వేడుకల్లో మారిషస్ నుంచి ఐ. పీ . ఎస్. స్థాయి శిక్షణకు వచ్చిన అధికారిని శాలోన్, డీ సీ పీ సునీల్ దత్, ఎ సీ పీ జైపాల్ రెడ్డి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు