యాదవుల శుభకార్యాలు, సమావేశాలు జరుపుకొనుటకు సౌకర్యార్ధం, యాదవుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సత్తుపల్లిలో 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హల్ ను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మంజూరు చేయించి, తగు మంజూరు పత్రాన్ని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులకు అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పేద, సామాన్య ప్రజల ఇండ్లతో జరిగే శుభకార్యాలకు, బస్తీలలో జరిగే సామూహిక వేడుకలకు కమ్యునిటీ హాల్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కుసంపూడి మహేష్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, జడ్పీటీసీ కుసంపూడి రామారావు, యాదవ సంఘం అధ్యక్షులు దూదిపాళ్ళ నరసింహారావు,తెల్లగోర్ల కృష్ణారావు, గంగుల బాబు, జంగా సత్యనారాయణ, జోనబోయిన రామకృష్ణ, పిన్నిబోయిన శ్రీకాంత్, కర్రీ వెంకటేశ్వరరావు, తొర్లపాటి నాగేశ్వరరావు, మామిళ్ళ కోటేశ్వరరావు, మధు, కొప్పుల చిన్నస్వామి, బడుగు శ్రీకాంత్, గంగుల మోహన్ రావు, కాలసాని గజేంద్రరావు, కొప్పుల నాగేశ్వరరావు, ముసిముక్కు శ్రీనివాసరావు, చిమట రమేష్, జోనబోయిన శివ, నూతలకంటి పెద్దిరాజు, మాగసాని ప్రసాద్, వెంకటేశ్వరరావు, మంద శివసాయి, రాగం సందీప్, తోట నాగరాజు, పాకనాటి హరిబాబు, రాచూరి శ్రీను తదితరులున్నారు.