తెలంగాణ ఆర్టీసీ సంస్థ ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్’ కు శ్రీకారం చుట్టింది. మొదటగా ఈ పాస్ ను కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో అమలు చేయనున్నారు.
ఈ టౌన్ పాస్తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబూబ్ నగర్ లో పదికిలోమీటర్ల, నిజామాబాద్, నల్గొండలో ఐదు కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయచ్చు.. పాస్ ధరను పది కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, ఐదు కిలోమీటర్ల పరిధికి రూ.500గా నిర్ణయించినట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది.