వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.సోమవారం హనుమకొండలోని వారి నివాసంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలో వ్యవసాయ పంట సాగులో ప్రస్తుత పరిస్థితులపై గ్రామాల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..రైతులకు ఎలాంటి సమస్యలున్నా వ్యవసాయ అధికారులు వెంట పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.
రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ప్రతి క్లస్టర్ లో రైతుల వివరాలు,సాగుచేస్తున్న పంటల వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు రైతువేదికల్లో రైతులకు అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో క్లస్టర్లో పర్యవేక్షించి రైతులు సాగుచేస్తున్న పంటలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతుబీమా, రైతుబందు,ఉచిత 24కరెంటు ఏవిధంగా అమలుచేస్తున్నదో వివరించాలి.త్వరలోనే మొన్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం చెక్కులు అందుచేత కార్యక్రమం ఉంటుందని అన్నారు.ఇప్పటివరకు రైతుభీమా లేనటువంటి రైతులు ఆగస్ట్ 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.