రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తమ స్వరూపాన్ని బయటపెడుతూ రైతన్నలకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలని ఉచిత విద్యుత్ అవసరం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు చేపట్టనున్నకార్యక్రమాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచనలు ఎండగట్టేలా నినాదాలతో కాంగ్రెస్ పాలలో రైతు కష్టాలను కళ్ళకు కట్టే విధంగా ఉన్న ఫోటోలతో నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామగ్రామాన ఏర్పాటు చేయనున్న1000 ఫ్లెక్సీల కార్యక్రమం సందర్భంగా ఫ్లెక్సీలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని రైతు వేదికల వద్ద పది రోజులు పాటు రైతులతో సమావేశాలు, అన్ని పట్టణాల్లో మండల కేంద్రాల్లోని కూడళ్ళలో హార్డింగ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.